Posted on 2025-08-16 12:22:42
రాజకీయ భీష్మ పితామహుడిగా సేవలందించిన నేత ఆయన అని కొనియాడిన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు
స్వతంత్ర సమరయోధులుగా, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్వక్తి భారతరత్న అటల్ జీ దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. జాతీయ పునః నిర్మాణం కోసం దేశభక్తి పెంపొందించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లొ క్రియాశీలకంగా పనిచేసారన్నారు. రాజకీయంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం దేశ అభివృద్దే లక్షంగా ప్రజా సేవే మార్గంగా ఏర్పాటు చేసిన జన్ సంఘ పార్టీ అధ్యక్షులుగా,తరువాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పని చేసారన్నారు. మొదట రెండు ఎంపీ స్థానాలకె పరిమితం ఉన్న పార్టీని ప్రభుత్వం స్వాతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతి పరుడు అటల్ జీ కొనియాడారు.
3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సూపరిపాలన అందించి చరిత్రలో ఎక్కిన నాయకుడని రాజకీయ భీష్మ పితామహుడుగా అటల్ జీ. రాజకీయ పార్టీలకు అతితంగా అందరు మెచ్చిన నాయకుడని అన్నారు. వాజ్పేయి నాయకత్వంలోనే భారతదేశంలో విద్య, వైద్యం మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేసారన్నారు. ఆర్ధిక వ్యవస్థ పటిష్టకు ఆనాడు అటల్ జీ వేసిన పునాది నేడు మూడోవ స్థానంలో భారత్ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని,విదేశాంగా విధానంతో సహా అన్ని రంగాలలో గణనియమైన సంస్కరణలు చూసిందన్నారు. పోక్రాన్ -2 అనుపరీక్ష, లాహోర్ డిక్లరేషన్ వంటి దౌత్య కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించడం జరిగిందన్నారు. అటల్ జీ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్బంగా సూపరిపాలన దినంగా మనం అధికారికంగా జరుపుకోవడం గర్వకారణం అన్నారు. ప్రభుత్వాలు, అధికారం వస్తుంటాయి పోతుంటాయి దేశమే మాకు ప్రధానం అన్న అటల్ జీ వ్యాఖ్యలు రాజకీయ నాయకులను ఎంతగానో ప్రేరేపిస్తాయన్నారు. నేటి యువ తరం, రాజకీయ నాయకులు అందరు అటల్ జీ ని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి, అటల్ జి, కలలు కన్నా జాతీయ పునః నిర్మాణం కోసం అందరు కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ గారు, బిజెపి నాయకులు మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, ప్రభాకర్, కోడూరు నాగరాజు, పుట్టవీరేందర్, హరీష్ రెడ్డి, పంచ రెడ్డి శ్రీధర్,మట్టం పవన్, పవన్ ముందడ, చిరంజీవి, ఇప్పకాయల కిషోర్, లక్కం భూమేష్, మురళి, సుగంధం హరీష్,వెంకట రాములు, నరేష్ గౌడ్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >