Posted on 2025-08-18 12:02:02
13 గేట్లు ఎత్తివేసిన అధికారులు
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:ప్రాజెక్టుకు వరద పోటీత్తడంతో అధికారులు వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అదివారం రాత్రి 7 గేట్లను ఎత్తి 53,500 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదిలిన అధికారులు సోమవారం ఉదయం 13 గేట్లను ఎత్తి 85,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15. 667 టీఎంసీల నీరు నిల్వఉంది. 85,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీరా నదికి వరదలు రావడం, సింగూర్ డ్యాం నుంచి 43,634 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుండటంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను పెంచినట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నీటి విడుదలను జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రాజెక్ట్ అధికారులు పర్యవేక్షించారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >