Posted on 2025-08-19 05:05:48
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >