| Daily భారత్
Logo




ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, కార్మిక, పెన్షనర్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జంగ్ సైరన్

News

Posted on 2025-08-19 17:44:56

Share: Share


ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, కార్మిక, పెన్షనర్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జంగ్ సైరన్

అక్టోబర్ 12న టీజీ ఈ జెఎసి ఆధ్వర్యంలో  చలో హైదరాబాద్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ జిల్లాల కు బస్సుయాత్రలు, ఉద్యోగుల సదస్సులు 

మారం జగదీశ్వర్,  ఏలూరి శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్,  సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లి, హైదరాబాద్ లో 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొనగా.. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ప్రధానంగా పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సి అమలు, పెండింగ్ డీఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణ

సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు సాయంత్రం 3:00 గం.ల నుండి, వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతోపాటు  33 జిల్లాల కేంద్రాల్లో ఐ డి ఓ సి  నందు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర నిర్వహణ 

సెప్టెంబర్ 8 న వరంగల్ జిల్లా

సెప్టెంబర్ 9 న కరీంనగర్ జిల్లా 

సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా 

సెప్టెంబర్ 11న నిజాంబాద్ జిల్లా 

సెప్టెంబర్ 12న సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో సెప్టెంబర్ 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో 

సెప్టెంబర్ 16న మహబూబ్నగర్ జిల్లా 

సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లా 

సెప్టెంబర్ 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో 

సెప్టెంబర్ 19 నుండి మిగతా జిల్లాలలో..ఉద్యోగులు , ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం  అనుసరిస్తున్న తీరు నోటితో పలకరించి , నొసటితో  వెక్కిరించినట్లుగా  ఉందని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్  కమిటీ నాయకులు తప్పు పట్టారు. మంగళ  వారం   నాంపల్లి  లోని  టీఎన్జీవో  కార్యాలయంలో   టి జి ఈ జె ఎ సి  కార్యనిర్వాహక  కమిటీ  సమావేశం నిర్వహించారు. రాష్ట్ర  ప్రభుత్వం  గత  సంవత్సరనర కాలంగా ఉద్యోగులు , ఉపాధ్యాయుల సమస్యలను  ఇదిగో  తీరుస్తాం , అదిగో  తీరుస్తామని కమిటీలు  వేస్తూ..  కాలం గడపడమే  తప్ప  సమస్యల పరిష్కారం  చేయలేదని  నాయకుల విమర్శించారు. ప్రభుత్వంతో  సామరస్యం  ముగిసిందని, డిమాండ్ల  సాధనకు  తమకు  ఇక  సమరమే మిగిలిందని  అన్నారు. అందుకే సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగుల చేసి బస్సు యాత్రలు చేస్తూ ఉద్యోగులను గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు కదిలిస్తామని చివరగా అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలంగాణ టీజేఏసీ ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు ఉద్యోగ లోకానికి చెల్లిస్తామని చెప్పినప్పటికీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తాత్సర్యం చేస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాగే ఈ ఎచ్ ఎస్ ఉద్యోగుల ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగారు ఇ ఎచ్ ఎస్ అమలుకు మోకాలు అడ్డుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలాగే, బకాయిపడ్డ 5 డి ఏ లు అడిగితే కేవలం ఒక్కడిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంలో ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని విమర్శించారు.

అలాగే 1.7.2023 నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం, అధికారుల కమిటీ టీఈ జి జే ఏసి ఇచ్చిన 63 డిమాండ్ లకు సంబంధించిన  నివేదికను ఇంతకాలం. బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కదా అని ప్రశ్నించారు... 

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం  20 నెలలుగా వేచి చుసినపటికి చేసిన ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చినప్పటికీ, ఆ హామీలు అన్ని పరిస్కరించబడాలని టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలియజేశారు.

ఆరోగ్య రక్షణ పథకాన్ని  జూలై నెల ఆఖరులోపే పూర్తిస్థాయిలో నిబందనలనురూపొందించి అమలుచేయాలన్నారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయుటకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారి చేయాలన్నారు.

వివిదకారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో

నూతనముగా ఏర్పడిన మండలాలకు ఎంఈఓ   పోస్టులను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఎస్. ఎస్. ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలని అన్నారు.

సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రాలలో జరుపుతామనీ అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో తెలిపారు.


సమావేశానికి నిజాంబాద్ జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం గారు, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >