| Daily భారత్
Logo




ఇల్లంతకుంట మండల సమాఖ్య సేవలు ఆదర్శనీయం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-08-19 18:22:26

Share: Share


ఇల్లంతకుంట మండల సమాఖ్య సేవలు ఆదర్శనీయం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఆత్మ నిర్బర్ సంఘాతన్ అవార్డు స్వీకరించడం అభినందనీయం

కలెక్టర్ ను కలిసిన డీఆర్డీఓ, ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆత్మ నిర్బర్ సంఘాతన్ అవార్డును ఈ నెల 14వ తేదీన కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ నుంచి డీఆర్డిఓ, ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు అవార్డు స్వీకరించిన సందర్భంగా మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య బ్యాంకు రుణాల అందజేత, రికవరీ, క్రమం తప్పకుండా మీటింగ్ల నిర్వహణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై అభినందించారు. మహిళా సంఘాలకు ఇలాగే సేవలందిస్తూ మహిళలందరూ ఆర్థికంగా రాణించేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పథకాల లబ్ధి మహిళలకు చేకూరేలా సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఆదర్శ మండల సమాఖ్య ను ఆదర్శంగా తీసుకుని మిగతా సంఘాలు సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి అవార్డు తీసుకున్న డీఆర్డిఓ, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య బాధ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా, ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య బాధ్యులు ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >