Posted on 2025-08-19 18:25:08
పంటల సాగుకు సరిపడా యూరియా నిలువలు
రైతులు ఆందోళన చెందవద్దు
యాజమాన్య పద్ధతులు పాటించి.. ఎరువులు వినియోగించాలి
వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి.. రైతులకు సేవలందించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. జిల్లాలో పంటల సాగు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు తదితరు అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సాగు విస్తీర్ణం, ఎరువుల నిలువలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఆయా పంటల సాగుకు అణుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామని స్పష్టం చేశారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని తమ మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు.
రైతులు తమకు అవసరమైన ఎరువులు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా.. ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారు యాజమాన్య పద్ధతులు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించి ఎరువులు వినియోగించేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం ఏడీఏలు ఏవోలు ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >