| Daily భారత్
Logo




ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై వ్యక్తి దాడి

News

Posted on 2025-08-20 07:03:14

Share: Share


ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై వ్యక్తి దాడి

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటికే వెళ్లిన ఓ వ్యక్తి.. సీఎంపైనే దాడికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. సదరు వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో బుధవారం రోజు ఉదయమే “జన్ సునాయి” (ప్రజా విజ్ఞాపనల స్వీకరణ) కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా తన వద్దకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వారి కష్టాలను వింటూ తీరుస్తానని చెబుతున్నారు. ఈ సమయంలోనే ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు వింటున్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. క్షణాల్లోనే అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అదృష్టంకొద్దీ ఈ ఘటనలో ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాలేవు

అయితే సదరు నిందితుడు ఫిర్యాదుదారుగా మారువేషంలో వచ్చి ఈ దాడికి పాల్పడినట్టు తెలిస్తోంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి నివాసంలోనే ఇలాంటి సంఘటన జరగడం విచారకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుపుతున్నారని, పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడవుతాయని తెలిపారు. సీఎం ఇంటికే వచ్చి ఆ వ్యక్తి దాడి చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి ఎందుకు ఆ వ్యక్తి సీఎంపై దాడి చేశాడనేది.

మరోవైపు సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడిని కాంగ్రెస్ కడా తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యుక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై దాడి దారుణం అన్నారు. సీఎంకే రక్షణ లేకపోతే.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >