Posted on 2025-08-20 07:20:34
డైలీ భారత్, భద్రాచలం: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది.
గోదావరి వద్ద ప్రవాహం భారీగా ఉంది. 9,40,345 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నాన ఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కల్యాణ కట్ట వరకు వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరూ కూడా లోపలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి.
మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,28,453 కాగా, ఔట్‌ఫ్లో 1,30,715 క్యూసెక్కులుగా ఉంది.
గోదావరి వరద నీటిమట్టం.. 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు.. ఈరోజు ఉదయం 08:15 ని.లకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు
Date :- 20-08-2025
Time :- 08.15 AM
Godavari water Level :- 43.00 fts
Discharge :- 9,32,288 cusecs
రెండోవ ప్రమాద హెచ్చరిక...48 అడుగులకు
కళ్యాణకట్ట వరకు చేరుకున్న గోదావరి వరద.. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు...
లాంచీలు,గజ ఈతగాళ్లను సిద్ధం చేసిన అధికారులు..
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >