Posted on 2025-08-20 07:23:53
జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి..
అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది.
కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలియజేశారు.అత్యవసరమైతే తప్పు బయటికి రావద్దని సూచించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు,వాగులు,వంకల వద్దకు వీడియోల కోసం,సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.
వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు...
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >