Posted on 2025-08-22 16:18:15
ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేసుకొని.. ఆర్థికంగా వృద్ధి చెందాలి
ఇందిరా మహిళ శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు
ముస్తాబాద్ లో ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు ప్రారంభం
డైలీ భారత్, ముస్తాబాద్: ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా కింద ముస్తాబాద్ మండల కేంద్రంలోని శుభోదయం గ్రామైక్య మహిళా సంఘం వారిచే ఏర్పాటు చేసిన నూతన ఎరువుల దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. మహిళలు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులు ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం ముస్తాబాద్ మండలం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి మహిళా సంఘాల సభ్యులు రైతులు ప్రజలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >