| Daily భారత్
Logo




పి.ఎం.కే.ఎస్.వై ప్రతిపాదనలు 3 రోజులలో అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-08-22 16:25:15

Share: Share


పి.ఎం.కే.ఎస్.వై ప్రతిపాదనలు 3 రోజులలో అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రధాన మంత్రి కృషి సించాయే యోజన 3.0 ప్రతిపాదనల పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పి.ఎం.కే.ఎస్.వై ప్రతిపాదనలు 3 రోజులలో అందించాలని  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.

శుక్రవారం  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి కృషి సించాయే యోజన 3.0 ప్రతిపాదనల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,* జిల్లాలో ఉన్న 255 గ్రామ పంచాయతీ పరిధిలో క్లస్టర్ వాటర్ షెడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం క్రైటిరియా, వేయిటేజ్ ఎంపిక చేయాలని అన్నారు. 

ప్రతి నీటి చుక్కను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ పంట పోలాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం*హర్ కేత్ కో పానీ* నినాదంతో  ప్రధాన మంత్రి కృషి సించాయే యోజన 3.0 పథకం ప్రవేశ పెట్టిందని అన్నారు.గ్రామాల్లో ప్రధాన మంత్రి కృషి సించాయే యోజన 3.0 క్రింద నూతన ప్రతిపాదనలు శాఖల వారీగా 3 రోజులలో తయారు చేసి డి.ఆర్.డి.ఏ కు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, సిపిఓ మల్లేశం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం, జిల్లా హార్టికల్చర్ అధికారి లత సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >