| Daily భారత్
Logo




రేషన్ డీలర్ల శాంతియుత ధర్నా విజయవంతం

News

Posted on 2025-08-22 18:37:03

Share: Share


రేషన్ డీలర్ల శాంతియుత ధర్నా విజయవంతం

సక్సెస్ చేసిన రేషన్ డీలర్ సోదర,సోదరీమణులందరికి పేరు పేరున ధన్యవాదాలు

డైలీ భారత్, హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ డీలర్లకు   మానిఫెస్టోలో పెట్టిన 5000 రూ.ల గౌరవ వేతనం, 300 కమీషన్ వెంటనే ప్రకటించాలని, గత 5 నెలలుగా డీలర్లు పంపిణీ చేసిన  బియ్యం కమీషన్ డబ్బులను వెంటనే చెల్లించాలనే ప్రదాన డిమండ్ లు మరియు ఇతర ముఖ్య డిమాండ్ ల సాదన కొరకు ఈరోజు హైదరాబాద్,ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ నందు నిర్వహించిన శాంతియుత ధర్నా విజయవంతమైంది. నిన్న రాత్రి 10 గం.లకు వచ్చిన పొలీస్ పర్మిషన్ మేరకు ఈరోజు OU జె.ఏ.సి బంద్ ఉన్నందున 50 మంది తో మాత్రమే నిర్వహించాలని పోలీసులు కోరిన మేరకు... జిల్లా అధ్యక్షులకు జిల్లాకు ఇద్దరు డీలర్లనే తీసుకురావాలని ఫోన్ లో కోరగా, వివిద జిల్లాల ప్రతినిధులతో కలసి 200 మంది డీలర్లు "దర్నా"కు హాజరు కావడం శుభ పరిణామం. ధర్నాకు హాజరయిన డీలర్లు ఉదయం 12 గం.ల నుండి సాయంత్రం 4 వరకు ఓపికగా దర్నా లో పాల్గొన్నారు. జిల్లాల ప్రతినిథులు డీలర్ల సమస్యల గురించి కార్యక్రమంలో ప్రసంగించగా డీలర్లు సమిష్టి స్పూర్తిని ప్రదర్శించారు. దర్నా చౌక్ ఇంటెలీజెన్స్ పోలీస్ అధికారుల ద్వారా CM రేవంత్ రెడ్డి కి, పౌర సరాఫరాల శాఖా ఉత్తం కుమార్ రెడ్డి కి డీలర్ల డిమాండ్ ల యెక్క "మెమొరాండం" లను సమర్పించడం జరిగింది.    

రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేశ్ బాబు మాట్లాడుతూ... నా లక్ష్యం ఉద్యమం ద్వారా డీలర్లకు కనీస గౌరవ వేతనం సాధించడమే అన్నారు. ప్రభుత్వం నుండి డీలర్ల యెక్క ప్రదాన డిమాండ్లను సాదించడానికి రాష్ట్ర కార్యవర్గం తో కలసి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. గౌరవ వేతనం కొరకు ఎవరు పనిచేసినా తనవంతు సహకారం ఉంటుందన్నారు. తనకు పదవి కన్నా డీలర్ల శ్రేయస్సే ముఖ్యమని, గతం లో JAC చైర్మన్ ఇస్తేనే ఉద్యమానికి సహకరిస్తా అన్న వాళ్లకు తృణప్రాయంగాJAC చైర్మన్ పదవి ఇచ్చానని, ప్రజాస్వామ్య బద్దంగా జరిపే ఏకనాయకత్వ ఎన్నికలకు రమేశ్ బాబు మరియు కార్యవర్గం ఎప్పుడైనా సిద్దమే అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ లోపు డీలర్లకు ప్రభుత్వం నుండి కమీషన్ చెల్లించబడకుంటే నిరసన గా సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్ర వ్యాప్త డీలర్ల ఒకరోజు బంద్ కొనసాగుతుందని బంద్ ను విజయవంతం చేయాలని రమేశ్ బాబు కోరారు. 

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >