Posted on 2025-08-24 10:39:05
వాసవి యువజన సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సేవా తత్పుర్యంలో వాసవి యువజన సంఘం ముందుండి ఇతర యువజన సంఘాల కంటే నూతనంగా ఎన్నికైన వాసవి యువజన సంఘం కార్యవర్గ సభ్యులు ఆదర్శంగా నిలబడాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ లో వాసవి యువజన సంఘం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు యువజన సంఘం లో ఎన్నికైన వారందరూ సమాజం పట్ల సమాజంలో ఉన్న ప్రజల చాయమందించినప్పుడే యువజన సంఘాల పేరు చిరస్థాయిలో నిలిచిపోతోందని ఆయన అన్నారు. ప్రజల్లో మమేకమై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే అర్బన్ ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించే దిశగా తాను ఎల్లవేళలా ముందుండి వాసవి యువజన సంఘానికి మద్దతుగా నిలుస్తానని ఆయన అన్నారు. కను కరోనా లాంటి విపత్తు సమయంలో సైతం అప్పటి వాసవి యువజన సంఘం వారు ముందుండి వ్యాధి ప్రబలిన వారికి ఆహార పాకెట్లతో పాటు వారికి ధైర్యం చెప్పిన విషయం తనకు ఇప్పటికీ గుర్తు ఉందని ఆయన అన్నారు. సమాజంలో ప్రకృతి విపత్తుల నుండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి తమ వంతు సాయం చేసినప్పుడే జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వాసవి యువజన సంఘానికి ఉందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గం చే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయనను వాసవి యువజన సంఘం సభ్యులు సన్మానించి సత్కరించారు. నూతనంగా ఎన్నికైన యువజన సంఘంలో అధ్యక్షుడిగా తోడుపునూరి అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొండ నర్సింగ్ రావు గుప్తా, కోశాధికారి పసుపునూరి రఘునాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >