Posted on 2025-08-24 15:25:19
తమకు విద్య నేర్పిన గురువులకు జీవితాంతం రుణపడి ఉంటామన్న పూర్వ విద్యార్థులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా 45 ఏళ్ల క్రితం జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేదికగా ఒక్క చోట కలిశారు. దీంతో చిన్ననాటి విద్యార్థి జ్ఞాపకాలను ఒకరినొకరు నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో 45 ఏళ్ల క్రితం 1980 -81 సంవత్సరంలో చదివిన ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తో చిన్ననాటి తమ స్నేహితులు, క్లాస్మేట్స్, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు అందరూ కలిసి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒకరి బాధలను మరొకరు తెలుసుకొని ఇకపై తమ బ్యాచ్ మొత్తంలో కలిసికట్టుగా ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుండి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి జీవితానికి విద్యార్థి దశ ఎంతో గొప్పదైననని, దానికి వెల కూడ, కట్టలేనిదని అప్పటి 45 ఏళ్ల క్రితం విద్యార్థులు విద్యార్థి దశ గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తమతో పాటు చదివిన విద్యార్థులు ప్రస్తుతం కార్యక్రమంలో లేనప్పటికీ వారి చిన్ననాటి స్మృతులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. అలాగే తమకు చదువు నేర్పిన గురువులను ప్రతి ఒక్కరిని జీవితాంతం గుర్తుంచుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి తమ గురువులను ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >