| Daily భారత్
Logo




ప్రధాని మోడీ 11 ఏళ్ల పాటు సుపరిపాలను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలు

News

Posted on 2025-08-24 15:26:29

Share: Share


ప్రధాని మోడీ 11 ఏళ్ల పాటు సుపరిపాలను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలు

బిజెపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: సోమవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  జన్మదిన సందర్భంగా  కాంగ్రెస్ అగ్రనేత సోనియా కుటుంబం గాంధీ నామ్ చోర్ చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు . రాహుల్ గాంధీ ఓటు చోర్ అని డ్రామాలు చేస్తుందని ఆరోపించారు. దేశంలో మోదీ 11 ఏళ్ల సుపరిపాలనను ఓర్వలేక ప్రజలను తప్పు దోవ పట్టించాలని రాహుల్ చూస్తున్నారని అన్నారు. ఓటు చోర్ జరిగిందని కాంగ్రెస్ నేతలు భావిస్తే తక్షణమే రాజీనామా చేసి గెలిసి వాళ్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం అని గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు దోషులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి నాయకులను, కేసీఆర్ ను కాపాడటానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. దోషులను శిక్షించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో ఒక బీసీ బిడ్డను ఎందుకు నిలబెట్టలేకపోయిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణలో కొత్తగా మార్వాడి గో బ్యాక్ అని అల్లర్లు చేసే కుట్ర జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధం అవుతున్నారని తెలిపారు. బీజేపీ కార్యకర్తల్లో, నాయకుల్లో నూతన ఉత్సాహన్ని నింపడానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు సోమవారం ఇందూర్ జిల్లాకు వస్తున్నారని, బీజేపీ కార్యకర్తలు అందరు హజరై ఈసభను విజయవంతం పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, పోతంకర్ లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >