| Daily భారత్
Logo




కమిషనరేట్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

News

Posted on 2025-08-24 18:03:11

Share: Share


కమిషనరేట్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురిపై కేసు నమోదు పోలీస్ కమిషనర్ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు ప్రవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాదు  పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,   శాంతి భద్రతలను భంగపెట్టే రీతిలో ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు ఒకరిని ఒకరు గౌరవిస్తూ, హింసకు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులు తక్షణమే తమ బాధను సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు.

టౌన్ 1 పోలీస్ స్టేషన్ కు సంబందించిన కేసు కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మెడికల్ కాలేజ్ లో 2021 నుండి ఎంబీబీఎస్ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం చదువు కొనసాగిస్తున్నాడు. ఇతను డే కాలర్స్ గా ఉన్నందున ఇతని సీనియర్ అయిన సాయిరాం పవన్ మొదటి సంవత్సరం  నుండి బూతు మాటలు ఇటుచూ ర్యాగింగ్ చేసేవారు.   రాహుల్ రెడ్డి  ప్రస్తుతం  ఫైనల్ ఇయర్ ఇతని యొక్క సీనియర్ అయిన సాయిరాం పవన్  అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని ఐదు రోజులు రానట్టు రిజిస్టర్లో గైర్హాజర్ వేశాడు. ఈ విషయం గురించి అడిగితే నీవు ఎవడ్రా అడగటానికి అని బెదిరించాడు ఈ విషయాన్ని  జూనియర్, సీనియర్స గా రెండు బ్యాచులుగా విడదీసి గొడవగా సృష్టించాడు, దీన్ని ఆసరాగా తీసుకొని రాబోయే గణేష్ నిమజ్జనాన్ని ఎలా నిర్వహిస్తారో చూస్తాము అంటూ బెదిరించి, చివరకు నిన్న సాయంత్రం నాతోటి స్నేహితులతో  ఫోన్ చేయించి పిలిపించి సెటిల్ చేసుకుందామని రాహుల్ రెడ్డి ని మెడికల్ హాస్టల్ కు పిలిపించారు. అతని  స్నేహితులతో కలిసి హాస్టల్  కు వెళ్లేసరికి అక్కడ సుమారు 15 మంది సీనియర్స్ ఉన్నారు వీళ్ళు నన్ను మళ్ళీ ర్యాగింగ్ చేసే విధంగా గోడకుర్చీ, జి. ఎం.సి. సెల్యూట్ చేయించి  అతని బయోడేటా పలుమార్లు చెప్పించారు, బట్టలు విప్పించి బయట తిప్పిస్తామని బెదిరించారు, స్నేహితులు ఆపడానికి మధ్య వస్తే వాళ్లను కూడా కొడతామని బెదిరించడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా సాయిరాం పవన్, శ్రావణ్,  సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది,  ఆదిత్య  అనే సీనియర్స్ కలిసి రాహుల్ రెడ్డిని చేతులతో కొట్టి కాలేజీలో ఎలా ఉంటావో ఎలా తిరుగుతావో ఎలా పాస్ అవుతావో చూస్తాము అంటూ  భయభ్రాంతులకు గురి చేయగా వారి నుండి తప్పించుకోని హాస్టల్ నుండి పారిపోయి ఇంటికి వెళ్లి తనకు ప్రాణ రక్షణ కల్పించగలరని దరఖాస్తు ఇవ్వగా దరఖాస్తుపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్ కి ఎవరైనా పాల్పడితే వారి పైన  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిసిన లేదా గమనించిన లేదా ర్యాగింగ్ కు సహకరించిన వారి సమాచారము దగ్గరలోని పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100 కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 కు సమాచారాన్ని అందించగలరు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతుందన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >