Posted on 2025-08-25 07:37:25
మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గప్ చుప్..
నేడు జిల్లాకు రానున్న రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర రావు రాకతోనైనా ఆ మాజీ ఎమ్మెల్యే వచ్చేనా..?
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా బిజెపి పార్టీ రాజకీయాల్లో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్లుగా మారింది. నిజామాబాద్ జిల్లా బిజెపి పార్టీ పరిస్థితి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముద్ర పడితేనే పార్టీలో మనుగడ సాధించవచ్చు అని తెలియకనే తెలుస్తుంది. ఆయా పరిస్థితులు ఘటనలు చూస్తుంటే 2009 అప్పటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఒక దశలో పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన అపార రాజకీయ అనుభవం కలిగిన డి శ్రీనివాస్ ను అప్పటి రాజకీయాల్లో బిజెపి పార్టీ తరపున అర్బన్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఎండల లక్ష్మీనారాయణ ఓడించారు. ఆ తరువాత 2010లో తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసి మళ్లీ జరిగిన ఉప ఎన్నికల్లో రెండోసారి డిఎస్ మరోసారి విజయం సాధించారు లక్ష్మీనారాయణ అలియాస్ బాయ్ సాబ్ ఇదంతా అందరికీ తెలిసిందే.. అర్బన్ రాజకీయాల పరిస్థితి.. ఎప్పుడైతే అదే డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ రాజకీయ అరంగేట్రం చేశాడో.. అప్పటినుండి అరవింద్ మార్క్ కొనసాగించడం ప్రారంభించాడు. అని రాజకీయ విశ్లేషకులకు, బిజెపి పార్టీలో అప్పటి మాజీ ఎమ్మెల్యే వర్గీయులకు తెలిసిన పచ్చి నిజాలు. ఇలా కొనసాగుతున్న జిల్లా పార్టీ రాజకీయాల్లో అనూహ్యంగా బిజెపి పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించుకుని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితను ఆయన రెండోసారి కూడా ఆమెను ఓడించారు. అందుకే అదే పార్టీలోని కొందరు అప్పటి మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఎవరిపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా పార్టీలో ఉన్నామా లేదా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు జిల్లా బిజెపి లో చోటు చేసుకున్న రాజకీయాలు. అరవింద్ ముద్రపడితేనే పార్టీలో నిలకడగా బిజెపిలో సాధించవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >