Posted on 2025-08-25 07:36:17
ఏకకాలంలో ఇద్దరినీ హత్య చేసిన నిందితులు
ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా (ఏ ) గ్రామంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన జీలకర్ర ప్రసాద్ పలు చోరీ కేసులలో నిందితుడు. జీలకర్ర ప్రసాద్ అతని స్నేహితుడు ఆదివారం రాత్రి మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో తనకు పరిచయం ఉన్న మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ మహిళ సంబంధీకులకు జీలకర్ర ప్రసాద్ కు మధ్య గొడవ జరిగింది. దీంతో రాడ్లు కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తో పాటు మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ లు పరిశీలించారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >