Posted on 2025-08-24 21:11:46
అర్ధరాత్రి అయినా తెరిచి ఉంటున్న పాన్ దుకాణాలు
జిల్లావ్యాప్తంగా జర్దా అమ్మని పాన్ షాప్ లు లేవంటే అతిశయోక్తి లేదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత పోలీస్ డిపార్ట్మెంట్ తీరు ఒక లెక్కైతే కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వచ్చిన సిపి సాయి చైతన్య తీరు లెక్క. దేన్నైనా చట్టానికి లోబడి ఎంతటి వారైనా దానికి అనుసరించి నడవాలని అన్నది సిపి సార్ తీరు.. గతంలో సిపిలు జిల్లాలో పనిచేసిన సమయంలో వైన్ షాపులు బార్లు అర్ధరాత్రి అయినా మద్యం ఏదైతే విక్రయాలు కొనసాగుతుండేవి. కానీ ఈయన వచ్చాక వీటన్నిటికీ స్వస్తి పలికారు. వైన్సులు, బార్లు తాము చెప్పిన సమయానుసారంగా నడవాలని ఆదేశాలు హుకుం జారీ చేసిన విషయం తెలిసింది.. ఇదంతా నానానికి ఒకవైపు అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి అయినా పాన్ షాప్లు తమకు అడిగేది ఎవరు అంటూ యదేచ్చగా భార్లా తెరుస్తూ పోలీస్ శాఖను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. నగరంలోని ప్రధాన వీధుల్లో పాన్ షాప్ యాజమానులు ఒక్కో వీధికి ఒక్కో అడ్డాగా మలుచుకుని నిషేధిత గుట్కా తంబాకు, లాంటివి గుట్టుచప్పుడ్డు కాకుండా నడిపిస్తున్నారు. స్వీట్ పాన్ల పేరిట, మత్తు రసాయనాలకు సంబంధించిన పదార్థాలను తమలపాకులో వేసి యువతను మత్తులోకి దించుతున్నారు. పాన్ దుకానుదారులు. జొమాటో, స్విగ్గి ఆర్డర్ల మాదిరిగా యువత మత్తులో జోగేందుకు అర్థరాత్రి అయినా పలు ప్రధాన విధుల గుండా ఆర్డర్లు స్వీకరిస్తూ పాన్ మసాలాలు అందించడం కోసమెరుపు. పేరుకే నిషేధం అమ్మకాలు అంతా బహిరంగం నగరంలో ఏ మూలకు వెళ్లిన ఏ గల్లీలోకి చూసిన విచ్చలవిడిగా నిషేధిత జర్దా అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మరోవైపు పాన్ మసాలాలపై నిషేధం లేకపోవడంతో వీటిని బహిరంగంగా విక్రయిస్తూ గుట్కా కావాలని అడిగిన వారికి జర్దాతో కలిపి ఇస్తూ ఇలా అమ్మకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా జర్దా అమ్మని పాన్ షాప్ లు లేవంటే అతిశయోక్తి కాదు. జిల్లా కేంద్రంలో పాన్ షాప్ లో ఇంత తతంగం కొనసాగుతున్న పోలీసులు, దీనికి సంబంధించిన అధికారులు పాన్ షాప్ లపై నిఘా పెడితే డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల అమ్మకాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ జర్దా గుట్కాలు విక్రయిస్తున్న పాన్ షాప్ లపై దృష్టి సారించడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పాన్ షాప్ లపై ప్రత్యేక నిఘా టీంను ఏర్పరిచి మత్తు లో యువత చెడు త్రోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >