Posted on 2025-08-25 10:59:50
చాలా కాలం తర్వాత స్టేజిపై దర్శనమిచ్చిన మాజీ జిల్లా అధ్యక్షుడు బసవ నరసయ్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గైర్హాజరు అయ్యారు. ఆహ్వానం అందకనో లేదా ఇతర ఏ కారణంతోనో సమావేశానికి హాజరు కాలేదు.
సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర రావు వచ్చిన రాలేకపోయారు. మరోవైపు చాలాకాలం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య స్టేజీపై దర్శనం ఇచ్చారు. అయితే జిల్లాలోని బిజెపి పార్టీ లో అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల పార్టీలో ఉన్న వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడు ఈ విషయాన్ని గ్రహించి జిల్లా బిజెపి పార్టీలో పాత కొత్త అనే తేడా లేకుండా అందరిని కలుపుకుపోయేలా ఒక తాటిపై తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఇద్దరూ నేతలను పిలిపించి రాష్ట్రస్థాయిలోనే సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన చేస్తే రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి పార్టీకి అయ్యే అవకాశం లేకపోలేదు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >