| Daily భారత్
Logo




ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్

News

Posted on 2025-08-25 13:33:45

Share: Share


ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన  చర్యలు తప్పవు : కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి జిల్లాకొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్  సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం అబ్దుల్ కలాం కాలేజీలో ర్యాగింగ్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడంజరిగింది.విద్యాసంస్థలలో ర్యాగింగ్ చేయడం నేరం, ర్యాగింగ్‌ లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు” అని  DSP  హెచ్చరించారు.విద్యార్థులు తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు, విద్యాసంస్థల నుండి తొలగింపు, భవిష్యత్తులో విద్యా–ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.సీనియర్లు జూనియర్లను వేధించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు.అలాగే, విద్యాసంస్థల యాజమాన్యం పట్ల కూడా DSP  ఆదేశాలు జారీ చేశారుప్రతి కళాశాలలో యాంటీ–ర్యాగింగ్ కమిటీలు, స్వ్కాడ్‌లు ఏర్పాటు చేయాలి.

కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి.అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిరంతరంగా నిర్వహించాలి.విద్యార్థులు ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నా కళాశాల యాజమాన్యనికి లేదా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ర్యాగింగ్ అనేది విద్యార్థుల వ్యక్తిగత భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని  జిల్లా DSP గారు స్పష్టంచేశారు.విద్యార్థుల పిర్యాదు కోసం  డయల్ 100 ద్వారా పిర్యాదు చేయాలనిసూచించారు.ఫిర్యాదుదారుల  వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ R. వెంకటేశ్వర్లు సుజాతనగర్ ఎస్ఐ M. రమాదేవి గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >