| Daily భారత్
Logo




బిజెపి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం

News

Posted on 2025-08-25 13:38:17

Share: Share


బిజెపి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం

బంగారు తెలంగాణగా తీర్చిదిద్దరిమే తమ పార్టీ లక్ష్యం

బిజెపి పార్టీ ది ఓట్ చోరీ  కాదు.. రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు ధ్వజం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి ఏమాత్రం తెలంగాణ అభివృద్ధికి నోచుకోవడం లేదని, బిజెపి పార్టీతోనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చి తీరుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బూత్ స్థాయి సభ్యుల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు ను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా  రైతులకు రూ. 6 వేలు చెల్లెస్తూ వస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను, నిరుద్యోగులను  మోసం చేస్తోందన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు ఎప్పుడు ఇస్తారో వారికి స్పష్టత లేదని అన్నారు.  

అబద్దాల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని, ఇది ఓట్ చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీ బిసిలకు 46 శాతం రిజర్వేషన్ ఇస్తుందని, కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అని చెబుతూ అందులో ముస్లిం లకు 10 శాతం ఇస్తోంది. అంటే 32 శాతమే ఇస్తున్నట్లు బీసీలను మభ్యపెట్టె కుట్ర పన్నుతుందన్నారు.

కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ కలిసి బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తోందని, వీటన్నిటిని తిప్పి కొట్టాల్సిన సమయం అవసరం బిజెపి శ్రేణులపైనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతుందనే భయంతోనే స్థానిక సంస్థలఎన్నికలు పెట్టడం లేదన్నారు. తెలంగాణలో బీ ఆర్ ఎస్ ను చూశాం,,, కాంగ్రెస్ ను చూశాం. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే లు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.


అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ శాతం పెరిగిన జిల్లా ఇందూరు అని, అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచిన పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఇదే ఈరోజు తన జన్మదినం సందర్భంగా ఓటర్లు ఇచ్చిన బహుమతిగా స్వీకరిస్తానని ఆయన అన్నారు. తాను మోడీ భక్తున్ని అందుకే పొగరుగా ఉంటానని స్పష్టం చేశారు.

అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మొట్టమొదటి జడ్పి చైర్మన్, కార్పొరేషన్ మేయర్ నిజామాబాద్ నుంచే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, 30 శాతం మహిళలకు రిజర్వేషన్ చేసింది మన ప్రధాని మోడీనే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >