| Daily భారత్
Logo




స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో అంధుల తల్లిదండ్రుల సమావేశం

News

Posted on 2025-08-25 13:39:32

Share: Share


స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో అంధుల తల్లిదండ్రుల సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సోమవారం స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, దివ్యాంగుల పాఠశాలలో అందుల ప్రత్యేక పాఠశాల తల్లిదండ్రుల సమావేశము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లోకల్ ప్రాజెక్ట్ చైర్ పర్సన్ చంద్రకళ కమిటీ పాల్గొని ప్రసంగించారు.

ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనొక దివ్యాంగురాలి తల్లిగా చెబుతున్న స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలల్లో, దివ్యాంగులకు మంచి సేవలు అందుతున్నాయని వారు మానసికంగా, సాంస్కృతికంగా, విద్యా పరంగా అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారని, కళ్ళు ఉండి తెలివి లేని వారు, తెలివి ఉండి కళ్ళు లేని వారికి, విద్యను అందిస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు జ్యోతి సిద్దయ్య లకు ఆమె అభినందనలు తెలిపారు. అందుల ప్రత్యేక పాఠశాలలో అంద విద్యార్థులు తమ అద్భుతమైన గాత్రంతో ఆలపిస్తున్న పాటలు ఎంతో మధురంగా ఉన్నాయని, అందరినీ ఆకట్టుకుంటున్నాయని ఆమె కొనియాడారు. దివ్యాంగుల స్వయం సమృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను పోషిస్తున్న సిద్దయ్య జ్యోతిలు నిజంగా అభినందనీయులు అన్నారు. అందులు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ అందుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ముఖ్యంగా సైన్స్ లో జాతీయస్థాయిలో అంధ విద్యార్థి పాల్గొన్నదని,  చెస్ లో రాష్ట్రస్థాయిలో తమ పాఠశాల అంద విద్యార్థులు బంగారు పతకాన్ని, వెండి పతకాన్ని సాధించారని అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో, యోగాలో అంధ విద్యార్థులు తమ ప్రతిభను చూపిస్తున్నారని ఆయన తెలిపారు. గత సంవత్సరం పాఠశాల విద్యాశాఖ ద్వారా గుర్తింపు పొంది అందులకు సేవల ను అందిస్తుందని, ఇప్పటివరకు తమ పాఠశాలలో చదువుకున్న 30 మంది అంధ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఆయన తెలిపారు. అందుల కోసం ఇంకా తమ సేవలను విస్తృత పరుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, లోకల్ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సుధా ఉపాధ్యాయురాలు, అబ్రహం, ఇస్రాత్ బేగం తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అంధ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకల్ ప్రాజెక్టు కమిటీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంధుల ప్రత్యేక పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >