| Daily భారత్
Logo




ఎంబిబిఎస్ విద్యార్థిపై ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్

News

Posted on 2025-08-25 17:20:32

Share: Share


ఎంబిబిఎస్ విద్యార్థిపై ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్​ మెడికల్​ కళాశాల లో జూనియర్​ను ర్యాగింగ్​ చేసిన విద్యార్థులు సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఇంటెన్స్​ను ఆరు నెలలపాటు సస్పెన్షన్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్​ ఘటనపై ప్రిన్సిపల్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సోమవారం ఉదయం సమావేశమైన విషయం తెలిసిందే. ఘటనపై ఇరువర్గాల వాదనలను వినడంతో పాటు జుడా మెంబర్​తో మాట్లాడిన అనంతరం సస్పెండ్​ చేశారు. అంతేకాకుండా తదుపరి చర్యలపై పోలీస్ శాఖ సమర్పించిన నివేదిక మీద చర్యలు తీసుకోనున్నారు. యాంటీ ర్యాగింగ్​ కమిటీ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, డీసీపీ, జీజీహెచ్​ సూపరింటెండెంట్​, అడిషనల్ సూపరింటెండ్​, వైస్ ప్రిన్సిపల్, అకడమిక్, డ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధిపతులు హాజరయ్యారు.

పటాన్​చెరుకు చెందిన రాహుల్​ రెడ్డి ప్రస్తుతం మెడికల్​ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్​ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్​ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్​ అయిన సాయిరాం పవన్​ రిజిస్టర్​లో నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా శనివారం సాయంత్రం మాట్లాడుదామని పిలిపించి సీనియర్లు దాడి చేశారు. పలువురు విద్యార్థులు రాహుల్​ను ర్యాగింగ్​ చేయడంతో పాటు బెదిరించారు.

బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు నగరంలోని వన్​ టౌన్​ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు పలువురు రాహుల్​పై దాడి చేశారు. ఈ మేరకు పోలీసులు బి ఎన్ ఎస్ 292, 115(2), 131 సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4(1), 4(11) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ర్యాగింగ్​కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్​ చేశారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >