Posted on 2025-08-25 15:42:27
20 లక్షల దోచుకున్న నిందితులు.
4 గురు నిందితులను అరెస్టు చేసిన చివ్వెంల పోలీసులు.
రూ.13.2 లక్షల నగదు స్వాధీం.
సూర్యాపేట డివిజన్ డిఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్. CI రాజశేఖర్, SI మహేశ్వర్
డైలీ భారత్, చివ్వెంల: పురాతన బంగారు నాణేలు అమ్ముతామని నమ్మబలికి రూ.20 లక్షలు మోసపూరితంగా దోచుకున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి రూ.13.25 లక్షల నగదు మరియు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
తుమ్మలపెంపహాడ్ గ్రామానికి చెందిన, దురాజుపల్లి గ్రమశివారులో హోటల్ నిర్వహిస్తున్న నిమ్మనగోటి వెంకటేశ్వర్లు అనే వ్యాపారిని నిందితులు A1పశుపుల గణేష్, A2 ఓర్సు చంటి ఇరువురు కలిసి పాత పరిచయం ఉన్న హోటల్ యజమాని వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి మా వద్ద పాత బంగారు నాణేలు ఉన్నాయి, తక్కువ ధరకు అమ్ముతాము అని 20 లక్షలకు బేరం కుదుర్చుకుని 10వ తేది రోజున రూ.5 లక్షల బయనాగా ఇచ్చాడు, మళ్ళీ మరునాడు రూ.15 లక్షల ఇచ్చాడు. డబ్బులు కట్టిన తర్వాతా నాణేల అడగగా ఇవ్వలేదు, విచిత్రమైన వీడియోలు పంపి గుర్తు తెలియని వ్యక్తులు మా వద్ద డబ్బు దోచుకెళ్లారు అని తెలిపినారు. మోసం గుర్తించిన హోటల్ యజమాని చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవగా అటెన్షన్ డైవర్షన్, బెదిరించి డబ్బు వసూలు చేసిన దానిపై చివ్వెంల PS నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. దర్యాప్తు లో భాగంగా ఈరోజు 4 గురు నిందితులను డురాజుపల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి నుండి రూ.13.25 లక్షల నగదు రికవరీ చేయడం జరిగినది. మొత్తం 9 మందిపై కేసు నమోదైంది వీరిలో నగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగినదని DSp తెలిపినారు.
నిందితులు పురాతన కాలం నాటి కుండలో బంగారు నాణేలు లభించాయని అబద్ధపు కథను సృష్టించి, తక్కువ ధరకే వాటిని అమ్ముతామని నమ్మబలికారు. 10.08.2025 నాడు బాధితుడి నుండి రూ.5 లక్షలు, 11.08.2025 నాడు రూ.15 లక్షలు వసూలు చేశారు. అనంతరం రెండు కోళ్ళను కోసి వాటి రక్తంతో గాయాలున్నట్లుగా నకిలీ వీడియో తీసి బాధితుడికి పంపి, గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు దోచుకుపోయారని నమ్మబలికారు. అదనంగా భయపెట్టుతూ ఫోన్‌పే ద్వారా రూ.10,000/- వసూలు చేశారు. డబ్బు పంచుకున్న విధానం: పసుపుల గణేష్ – రూ.12.50 లక్షలు ఓర్సు చంటి – రూ.6.00 లక్షలు ముద్దంగుల వెంకన్న – రూ.1.00 లక్ష పసుపుల సత్యం – రూ.0.50 లక్ష స్వాధీనం చేసుకున్న సొమ్ము: పోలీసులు నిందితుల వద్ద నుండి గణేష్ వద్ద రూ.9.80 లక్షలు, చంటి వద్ద రూ.3.20 లక్షలు, వెంకన్న వద్ద రూ.25,000/-, అలాగే నకిలీ వీడియో తయారు చేయడానికి ఉపయోగించిన Vivo Y75 మొబైల్ ఫోన్ ను సాక్షుల సమక్షంలో పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌ను DSP ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు సూర్యాపేట రూరల్ సి.ఐ. గారి పర్యవేక్షణలో, చివ్వెంల పోలీసు స్టేషన్ ఎస్.ఐ. వి. మహేశ్వర్ మరియు సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:
పురాతన నాణేలు, ఖజానా, త్వరగా డబ్బులు వస్తాయంటూ ఎవరైనా నమ్మబలికితే మోసపోవద్దు. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.
నిందితులు :
1. పసుపుల గణేష్ వయసు 24, కులం: వడ్డెర, వృత్తి: వ్యాపారం, R/o తేల్లబండ కాలనీ, దురాజపల్లి గ్రామం.
2. ఓర్సు చంటి వయసు 35, వృత్తి: మేసన్, R/o తేల్లబండ కాలనీ, దురాజపల్లి.
3. ముద్దంగుల వెంకన్న S/o రాములు, వయసు 30, వృత్తి: మేసన్, R/o తేల్లబండ కాలనీ, దురాజపల్లి.
4. పసుపుల సత్యం S వయసు 34, వృత్తి: మేసన్, R/o తేల్లబండ కాలనీ, దురాజపల్లి.
5. పసుపుల నవీన్ @ బంగారి, వయసు: 35 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: తేల్లబండ కాలనీ, దురాజపల్లి, చివ్వెంల మండలం. (Absconding / పరారీలో ఉన్నాడు)
6. ఓర్సు శ్రీను, తండ్రి: రాములు, వయసు: 35 సంవత్సరాలు, , వృత్తి: కూలీ, నివాసం: తేల్లబండ కాలనీ, దురాజపల్లి, చివ్వెంల మండలం. (Absconding / పరారీలో ఉన్నాడు)
7. ఓర్సు గోపమ్మ, వయసు: 30 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: తేల్లబండ కాలనీ, దురాజపల్లి, చివ్వెంల మండలం. (Absconding / పరారీలో ఉంది).
8. పసుపుల లక్ష్మి, వయసు: 32 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: తేల్లబండ కాలనీ, దురాజపల్లి, చివ్వెంల మండలం. (Absconding / పరారీలో ఉంది).
9. ముద్దంగుల అంజలి, వయసు: 30 సంవత్సరాలు,, వృత్తి: కూలీ, నివాసం: తేల్లబండ కాలనీ, దురాజపల్లి, చివ్వెంల మండలం. (Absconding / పరారీలో ఉంది).
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >