Posted on 2025-08-26 07:00:02
ఎన్.ఆర్.ఐ సహకారంతో నిర్వహణ -
నిరుపేదలకు చేయూత ఒక ఉన్నతమైన ఆలోచన - అధికారుల మనోభావం.
ఇకపై సేవా కార్యక్రమాలకు కేరాఫ్ గా మారనున్న తల్లాడ ప్రెస్ క్లబ్.
- అధ్యక్షులు గుడిపల్లి నారాయణ వెల్లడి
డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ అధ్యక్షతన తల్లాడ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణి కార్యక్రమం క్లబ్ సలహాదారు మునుకూరి అప్పిరెడ్డి కుమార్తె,అల్లుడు (ఎన్ఆర్ఐ )ల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తల్లాడ తాసిల్దార్ వంకాయలపాటిసురేష్ కుమార్, ఎంపీడీవో సురేష్ బాబు, తల్లాడ ట్రైనీ ఎస్ఐ బానోతు వెంకటేష్, మరియు ఈవో కృష్ణారావు లు కార్యక్రమానికి హాజరై నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.తొలుత ప్రెస్ క్లబ్ సభ్యుల వివరాలతో కూడిన బ్రోచర్ ను అధికారులు క్లబ్ అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనే భావన కలగడం ఇది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరగటం ఎంతో విశిష్టమైనదని వారు అభిప్రాయపడ్డారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ మాట్లాడుతూ ఎన్.ఆర్.ఐ దాతల సహకారంతో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని క్లబ్ చేతుల మీదగా చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇలాగే అందరం కలిసి ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, ఈరోజు దాదాపు 150 కి పైగా దుప్పట్లు పంపిణీ చేయడం నాకెంతో సంతృప్తినిచ్చిందని సహకరించిన దాతలకు,ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రానున్న రోజుల్లో తల్లాడ ప్రెస్ క్లబ్ సేవా కార్యక్రమాలకు కేరాఫ్ గా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం అధికారులను క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దుగ్గదేవర అజయ్ కుమార్,షేక్ ముస్తఫా,గౌరవ సలహాదారు ముకునూరి అప్పిరెడ్డి,ప్రధాన కార్యదర్శి మోదుగు జయరాజు, ఉపాధ్యక్షులు గురజాల నారాయణరావు,ఉపాధ్యక్షులు షేక్ మేహారాజ్,సహాయ కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి,సహాయ కార్యదర్శి అద్దంకి సురేష్, ప్రచార కార్యదర్శి గొడ్ల శ్రీనివాసరావు,కోశాధికారి గొల్లమందల నాగబాబు,ఉప కోశాధికారి మేడి రాంబాబు,క్లబ్ సభ్యులు శిలం కరుణాకర్ రెడ్డి,మేడి యాకూబ్,తేలూరి చిన్న ఏసు,అద్దంకి ప్రసాద్, గుమ్మా నరేష్,షేక్ సైదా, మేడి బసవయ్య,పున్నం శ్రీనివాసరావు,ఇస్నేపల్లి బాబురావు,ఎన్ వెంకటకృష్ణ,తాళ్ల కరుణాకర్,తోట నవీన్,పూల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >