| Daily భారత్
Logo




రేషన్ డీలర్లు బండి సంజయ్ కు వినతి పత్రం

News

Posted on 2025-08-26 09:19:39

Share: Share


రేషన్ డీలర్లు బండి సంజయ్ కు వినతి పత్రం

డైలీ భారత్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లు ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వానికి దేశంలోనే ఉత్తమ పంపిణీ వ్యవస్థ గా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. కానీ ప్రభుత్వం గత 5 నెలలుగా కేంద్ర కమీషన్ వేరు రాష్ట్ర కమీషన్ వేరు అంటూ డీలర్లకు కమీషన్ విడుదల చేయడం లేదనే సమస్యను ఈరోజు రాష్ట్ర అద్యక్షులు బత్తుల రమేశ్ బాబు అధ్వర్యంలో కేంద్ర హోం సహాయక శాఖా బండి సంజయ్ కి కరీంనగర్ లోని వారి నివాసం లో కలిసి విఙ్ఞాపణ పత్రాన్ని అందించి వివరించడం జరిగింది.

ఎప్రిల్ నెల నుండి ఆగస్ట్ నెల వరకు 5 నెలల కమీషన్ డబ్బులు రాక డీలర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏ నెలకు రావలసిన కమీషన్ ఆ నెలలో డీలర్లకు చెల్లించనందున రాబోయే వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగలను కూడా జరుపుకోలేని పరిస్థితి నెలకొందని, కావున దయతలచి ప్రభుత్వం నుండి రావలసిన 5 నెలల కమీషన్ డీలర్లకు వెంటనే ఇప్పించవలసిందిగా మినిష్టర్ సంజయ్ కి  విన్నవించి, కేంద్ర కమీషన్,రాష్ట్ర కమీషన్ అని వేరు వేరుగా కాకుండా ఒకే కమీషన్ గా డీలర్లకు చెల్లించేలా చర్యలు తీసుకోగలరని రమేశ్ బాబు కోరారు.

అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తున్న క్వింటాకు 90 రూ.ల కమీషన్ కు తోడుగా కనీస గౌరవ వేతనాన్ని కూడా ప్రకటించే విదంగా చూడగలరని రమేశ్ బాబు మినిష్టర్ కి విఙ్ఞప్తి చేశారు.  

సంజయ్ స్పందిస్తూ...

కేంద్ర ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, కమీషనరేట్ కు పంపకపోవడం అంటూ జరుగదని, రమేశ్ బాబు నుండి స్వీకరించిన మెమొరాండం ను పర్సనల్ సెక్రటరీకి ఇచ్చి, పూర్తి విషయాన్ని సివిల్ సప్లయ్ కమీషనర్ ని, ఫైనాన్స్ సెక్రటరీ ని కనుక్కుని స్టేట్ సివిల్ సప్లయ్ మినిష్టర్ గారి ద్వారా వారం రోజుల్లోగా పనిచేసి పెడతానని హామీ ఇవ్వడం జరిగింది.


కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా డీలర్ల సంఘం అద్యక్షులు రొడ్డ శ్రీనివాస్,రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు,కరీంనగర్ కార్యవర్గం గాలి గట్టయ్య, G.రవీందర్, B.రవీందర్, రుద్రవేణి కనుకయ్య,విజయ్, తదితరులు,రాష్ట్ర ప్రతినిథులు చిలగాని మోహన్, పోతరాజు రమేశ్ మహేశ్ మరియు సిరిసిల్ల డివిజన్ ప్రదాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >