| Daily భారత్
Logo




స్థానికులతో ప్రాణహాని ఉంది

News

Posted on 2025-08-26 13:34:48

Share: Share


స్థానికులతో ప్రాణహాని ఉంది

మీడియా సమావేశంలో ఒంటరి మహిళ ఆవేదన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రహరీ గోడ విషయంలో స్థానికుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఒంటరి మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆమె మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ జి జి నదకుడ గ్రామానికి చెందన మాడవేడి గోదావరి తన ఆవేదనను వెలిబుచ్చారు. గ్రామంలోని తన సొంత ఇంటికి సంబంధించి గ్రామపంచాయతీ అనుమతి ప్రకారం ప్రహరీ గోడను నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. చుట్టుపక్కల అయితే ఈ గోడను నిర్మించుకోకుండా తమ చుట్టుపక్కల ఉండే కొమరం వెంకటి అతని భార్య నాగమణి, కొమురం లక్ష్మి, మగ్గిడి అలియాస్ బుర్కా రవి, జవ్వాజి రాజేశ్వర్ గౌడ్, జవ్వాజి శేఖర్ గౌడ్, బొంగోని రాజా గౌడ్, మగ్గిడి గంగుబాయిలపై చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇటీవల కాలంలో తన ఇంటి వద్దకు వచ్చి వారు గొడవలు చేస్తున్నారని, దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడుతున్నారని తనను హత్య చేస్తానని  బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. దీనిపై నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మామూలు కేసుగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని గోదావరి ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తనను వేధించడం లేదని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి నుంచి వారి నుంచి తనకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు, జిల్లా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >