Posted on 2025-08-26 15:08:18
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జెడ్పీహెచ్‌ఎస్ అంబేద్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయకుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణానికి మిత్రమైన గణేశ విగ్రహాలను స్వయంగా తయారు చేస్తూ విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి మాట్లాడుతూ –
“ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల వాడకం వలన పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకే మట్టి వినాయకుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలు స్వయంగా విగ్రహాలు తయారు చేయడం వలన వారిలో కళాత్మక ప్రతిభతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుంది” అని తెలిపారు.
ఉపాధ్యాయులు పొలాస మల్లేశం, ఐత సత్యనారాయణ, సామల రమాదేవి, గూడూరు రవికుమార్, పర్కా ల రవీందర్, బాలె గంగాభవాని, జంగిటి భానుచందర్ తదితరులు విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అందరూ పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >