Posted on 2025-08-27 10:40:53
హాజరైన ఆయా శాఖల జిల్లా అధికారులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు.ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని, మన పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ పూజా కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, డీ డబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, తహసీల్దార్లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >