| Daily భారత్
Logo




వరుసగా భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి అప్రమత్తంగా ఉండాలి

News

Posted on 2025-08-27 16:11:09

Share: Share


వరుసగా భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి అప్రమత్తంగా ఉండాలి

వరదల్లో ఏ ఒక్క ప్రాణి మృతి చెందకుండా జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి

కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు  కురుస్తున్నాయి. మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో సీఎం రేవంత్​రెడ్డి స్పందిచారు.

వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని సీఎం రేవంత్​రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో  యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలి..

ఈ రెండు జిల్లాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు, అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అనుకోని పరిస్థితి ఎదురైతే వెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బృందాల సాయం తీసుకోవాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

భారీవర్షాలు కామారెడ్డి, మెదక్​ జిల్లాలను అతలాకుతలం చేశాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే లింగంపేటలో  పలు చెరువులు తెగిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్​ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరదలో పలువురు చిక్కుకోవడంతో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పర్యవేక్షణలో ఎస్పీ రాజేష్​ చంద్ర , సబ్​ కలెక్టర్​ కిరణ్మయి అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాలకు చేరుకుని సమీక్షించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >