Posted on 2025-08-27 16:19:32
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మట్టి మహా గణపతి..
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ ప్రాంగణంలో కొలువై ఉన్న మైసమ్మ తల్లి దేవాలయంలో పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ కిరణ్ కుమార్ గండికోట ఆధ్వర్యంలో మట్టి గణపతికి ఘనంగా నవరాత్రులు ప్రారంభం అయ్యాయి, ఇట్టి మహా గణనాధునికి పూజలు నిర్వహించిన కొండవీటి దత్తాత్రేయ శర్మ.
అందరిలో ఐక్యతా భావనను కల్గించే పండగ వినాయక చవితిమానవ జీవితం ప్రకృతితో ముడిపడి ఉందని ఈ పండగ నిరూపిస్తుంది.
పూర్వకాలంలో మట్టి విగ్రహాలనే పూజించేవారు. ఇది ప్రకృతికి ఎలాంటి హానీ తలపెట్టదు.
మట్టితో తయారు చేసినవి నీటిలో తేలికగా కరిగిపోతాయి. నీరు ఏ విధంగానూ కలుషితం కాదు. రంగుల విగ్రహాల తయారీలో రసాయనాలను వినియోగిస్తారు. ఇవి నీటిలో కరగవు. వీటి వల్ల నీరు కలుషితమై నిమజ్జనం చేసే చెరువులు, కుంటల్లో నివసించే జీవులు ప్రాణాలు కోల్పోతాయి.
మట్టి గణపతిని పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో.. నిత్యం వేలాదిమంది ప్రజలు ప్రయాణించే కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో కొలువై ఉన్న మైసమ్మ తల్లి ఆలయంలో మట్టి గణపతిని ప్రతిష్టించి గణేష్ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తుండడం పట్ల కిరణ్ కుమార్ గండికోట కు పలువురు అభినందనలు తెలియజేశారు.
వినాయక చవితి పూజ కార్యక్రమంలో చదలవాడ సూరి, సురేష్ శ్రీనగర్, అఫ్జల్, కంచు శ్రీనివాస్, రామ్ నాయక్, హమాలి రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >