Posted on 2025-08-27 16:21:17
డైలీ భారత్, వైరా:స్తానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఈ క్షణం నుంచి కృషి చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎన్నికల్లో మన సత్తాచాటాలని అభ్యర్థుల గెలుపు కోసం ఐకమత్యంతో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. బుధవారం వారి నివాసంలో నిర్వహించిన ఏన్కూర్ మండలం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అందుకు పార్టీ క్యాడర్ సిద్దంగా ఉండాలని కోరారు., ఇప్పటి నుంచే గెలుపు కోసం తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, అభ్యర్థుల గెలుపులో ప్రతి కార్యకర్త భాగస్వామ్యంగా ఉండాలని కోరారు.
కేసిఆర్ హయంలో రాష్ట్రంలో కొనసాగిన సంక్షేమ పథకాలపై, వాటి ప్రయోజనాలై ప్రజల్లోకి విసృతంగా చర్చ జరుపాలని పలుపునిచ్చారు. రైతు బందు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, కేసిఆర్ కిట్లు, రూ. 2 వేల పించన్లు, దళిత బంధు, బీసీ బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గురుకుల పాఠశాలలో ఏర్పాటు, నూతన గ్రామ పంచాయతీలో ఏర్పాటు, పల్లె ప్రగతి ద్వారా గ్రామాల నిర్వాహాణ వంటి కార్యక్రమాలపైన ప్రజల్లో విసృతంగా చర్చ జరిపి, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరును పొలుస్తూ ప్రజలకు వివరంగా చెప్పాలని కోరారు. అధికారంలో లేకపోయిన గ్రామీణ ప్రాంతాలలో పార్టీ క్యాడర్ చెదిరిపోలేదని, మన పార్టీపై, పార్టీ అధినేత కేసీఆర్ పై గట్టి నమ్మకం ఉందనే విషయం మనకు తెలుస్తుందని, ప్రజలు సైతం కేసిఆర్ ను మరువలేకపోతున్నారని గుర్తు చేశారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాయని సృష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లిన్ స్వీప్ అవుతుందని, అన్ని స్తానాల్లో గెలుపొంది ఏన్కూర్ మండలం కేంద్రంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు షేక్ బాజీ, రేపల్లెవాడ గ్రామ శాఖ రాచబంటి వీరభద్రం, నాచారం గ్రామ శాఖ కడియాల సుధాకర్, బురద రాఘవాపురం గ్రామ శాఖ షేక్ యాకుబ్ పాషా, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు గుగులోత్ మజిలాల్, మండల నాయకులు భుక్యా ధర్మా నాయక్, బోడ నర్సింహాలాల్, భుక్యా వినోద్ కుమార్, మల్లు ప్రశాంత్, షేక్ మౌలాలి, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు,.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >