| Daily భారత్
Logo




వాడి గ్రామాన్ని ముచ్చెత్తిన వరద

News

Posted on 2025-08-28 07:39:13

Share: Share


వాడి గ్రామాన్ని ముచ్చెత్తిన వరద

గత వందేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు 

స్థానికులకు వీడియో కాల్ చేసి వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత వందేళ్లలో ఎప్పుడు ఇంతలా వరద గ్రామంలోకి రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీ పెట్ నడిమి తండా ప్రాంతంలో ఉన్న ముత్యాల చెరువు ( వాగు) తెగిపోవడంతో వాడి వాగులోకి, హోన్నాజిపేట్ చెరువులోకి నీరు ఉదృతంగా ప్రవహించాయి. వాగులో చెరువులో  నిండిన వాటర్ వాడి గ్రామంలోకి ముంచెత్తాయి. ఒకేసారి ఊరిలోకి వరదరావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. చుట్టూ పక్కనే ఉన్న దాబా ఇళ్లలోకి ప్రజలు చేరుకున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం, ఒకవైపు ఊరిలో నుంచి వరద ప్రవహిస్తుండడంతో గ్రామస్తులకు ఏం చేయాలో పాలు పోయలేదు. బ్రిడ్జి పనులు పూర్తి అవ్వడంతో గండం తప్పిందని, లేదంటే ఇంకా గ్రామంలోకి వరద పోటెత్తేదని గ్రామస్తులు చిన్న సాయిలు తెలిపారు. 

నీట మునిగిన పంట పొలాలు

వరద ఉధృతంగా రావడంతో వాడి బ్రిడ్జి నుంచి, హోన్నాజిపేట్ రైస్ మిల్ పెట్రోల్ బంక్ ముందు నుంచి నీరు ప్రవహించడంతో పొలాలన్నీ నీటమునిగాయి. వాగును తలపించేలా పొంగి పోర్లయి.పంట పొలాలలో ఇసుక తేప్పలు, చెట్లు, చెత్తాచెదారం కుప్పలు తిప్పలుగా పేరుకపోయాయి. జిల్లా సంబంధిత అధికారులు మా గ్రామాన్ని కాపాడాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చిన్న సాయిలు, గజ్జల సంతోష్, కొండూరు రమేష్, లింగపురం సాయిలు కోరుతున్నారు. 

వాట్సాప్ వీడియో ద్వారా వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్


ఈ విషయాన్ని అక్కడి స్థానిక జర్నలిస్టు వీడియోల ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కర్క రమేష్ జర్నలిస్టు తో వాట్సాప్ వీడియో ద్వారా గ్రామంలో ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామస్తులు ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >