Posted on 2025-08-28 10:01:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు వెల్లడించారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు బుదవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలపై మరోసారి గురువారం మరోసారి సహాయ, పునరావాస కార్యక్రమాలు, ఆస్తి, ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి ನಾಗಿರದ್ದೆ, వరద భాదిత జిల్లాలకు నియమించేంచిన స్పెషల్ అధికారులు కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, గత 24 గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసిన్నప్పటికీ, పాలనా యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. రేపు కూడా వర్షాలు పడే అవకాశమున్నందున జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే ఎస్ డిఆర్ఎఫ్, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని తెలిపారు. పోచారం జలాశయానికి నీటి ఇన్-ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుండి బయట పడ్డట్టే అని నీటి పారుదల శాఖ అధికారులు తెలియచేసారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ఎస్సారెప్పీ నుండి మూడు లక్షల క్యూసెక్కుల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి లక్షా 90 వేలక్యూసెక్కుల జలాలను వదులుతున్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు సి.ఎస్ సూచించారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >