Posted on 2025-08-28 14:36:26
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అంతకంటే ఎక్కువ పాపమా...!
జి జి నడుకుడా ఒంటరి మహిళపై ఇంకా ఆగని దాడులు, బెదిరింపులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో డొంకేశ్వర్ మండలం జి జి నడకుడా గ్రామానికి చెందిన మాధవేడి గోదావరి అనే మహిళ కాంపౌండ్ వాల్ నిర్మించే విషయంలో తమ ఇంటి చుట్టూ ఇరువుపొరుగు వారు ఇష్టానుసారంగా అన్ని అనుమతులతో పంచాయితీ అధికారుల అనుమతులతో తనకు తన ఇంటికి రక్షణ కోసం కాంపౌండ్ వాల్ కోసం నిర్మాణం తలపెట్టితే తమ ఇంటి చుట్టుపక్క ఉన్నవారు
బుర్కా రవి అతని భార్య సుజాత వాళ్ల పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజ్ చేసే పిల్లలు చదువుతున్నామనే సంస్కారం లేకుండా తనను టార్గెట్ చేస్తూ తన ఇంటిపై డాడీ కాకుండా తనపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారంటూ ఆమె ఆవేదనను వెళ్లి బుచ్చారు. ముఖ్యంగా జవాజి రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి రాజకీయ పెద్దల అండ దండలు చూసుకొని తమపై ఈ దారుణానికి దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గిడి గంగుబాయి, జవాజి శేఖర్ గౌడ్ బొంగుని రాజా గౌడ్ కొమరం వెంకటి అతని భార్య నాగమణి కొమరం లక్ష్మి బుర్కా రవి అతని భార్య సుజాత వాళ్ల పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు విద్యాభ్యాసం చేస్తుంటారని ఆమె చెప్పారు. బొంగోని రాజా గౌడ్
లక్ష్మీ కుమారుడు సురేష్ నాగమణి నాగమణి కుమారుడు నరేష్ సైతం తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె శోకసముద్రన ఆమె తమ బాధను వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం వార్త పేపర్లో తమపై చెప్పానని సంతోషిస్తున్నావేమో పేపర్లు రాసిన వారు ఎవరో వారికి కూడా తెలివి లేదు అంటూ మీడియాను సైతం కూడా వారు విమర్శలకు ఎగబడ్డారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశావు ఆ ఎస్సై ఏం చేస్తాడు చూస్తాం రమ్మను అంటూ ఎవరినీ లెక్క చేయకుండా బండ బూటులు తిడుతూ తమపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టడమే కాకుండా రాళ్లతో దాడులకు దిగుతున్నారని ఆమె ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ తన పరిస్థితులో ఎవరైనా రాజ్యానికి ఏ నాయకులు గానీ, వేరే ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులకు ఇలాంటి అన్యాయం జరిగితే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా అంటూ ఆమె ప్రశ్నించారు. రాజకీయ నాయకుల బంధువులకు వారి సన్నిహితులకు ఒక న్యాయం తనకు ఒక న్యాయమా అంటూ ఆమె ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన మేము ఊరుకునేది లేదు అంటూ వారు రోజు రోజుకి రెచ్చిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మహిళలను రక్షించే ప్రత్యేక అధికారులు తమను కాపాడాలంటూ వారి భారీ నుండి కాపాడాలంటూ ఆమె దీనంగా వేడుకున్నారు. ఒకవేళ తన ప్రాణానికి నష్టం కలుగుతే పోలీసులు వీరందరి పైన కేసు నమోదు చేసి వారికి కఠినమైన శిక్ష విధించే విధంగా చూడాలని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి తమ ఇంటి సరిహద్దున ఉన్న స్థలంలో తనకు సంబంధించిన స్థలంలో కాంపౌండ్ గోడ కట్టుకుంటానంటూ పంచాయతీ కార్యాలయంలో అనుమతులు తన వైపే ఉన్నాయని అయినా వారు నేను కట్టుకునే కంపౌండ్ వాల్ కు ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదని, ఉదయం లేస్తే పడుకునే వరకు పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు తనపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టడమే కాకుండా రాళ్లతో దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆవేదనలను వ్యక్తం చేశారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >