Posted on 2025-08-28 16:57:00
వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలం వాడి గ్రామాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే సందర్శించి, వరద భాదితులను పరామర్శించారు.గురువారం తెల్లవారు జామున ఓన్నజీపేట గ్రామం శివారులో వున్నా ముత్యాల చెరువు పూర్తిగా తెగిపోవడతో భారీగా నీళ్లు ప్లో రావడంతో వాడి గ్రామంలోకి చేరాయి. గ్రామం లోని అన్ని ఇండ్లల్లోకి భారీ ఎత్తున నీళ్లు వచ్చి,బియ్యం,వంట సామానులు పాడైపోయినాయి. రూరల్ ఎమ్మెల్యే భూపతి వాడి గ్రామంలోని వాడ వాడ కు తిరిగి వరద భాదితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భారీ వర్షల కారణంగా ముత్యాల చెరువు తెగిపోవడంతో నీళ్లు ఉదృతంగా రావడంతో మద్దుల తండా కు వాడి గ్రామానికి మధ్యలో వున్నా బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయ్యాయని, వాడి గ్రామంలో కరంట్ స్తంబాలు, ఇండ్లల్లోకి నీళ్లు వచ్చి వంట సామాగ్రి మొత్తం పాడైపోయాయని అన్నారు. కొంతమంది ని ఓన్నజీపేట హై స్కూల్ లో షెల్టర్ ఇవ్వడం జరిగిందని,వారికి అన్నివిధాలా ప్రభుత్వం ఆడుకోతుందని అన్నారు. కరెంట్ స్తంభాలను త్వరగా రిపేర్ చేయమని విద్యుత్ అధికారులతో ఫోన్ లో మాట్లాడం జరిగింది. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, అండగా ఉంటానని అన్నారు. అలాగే బీరప్ప తండా, నడిమి తండా,లక్ష్మి చెరువు తండాలో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పర్యటించి, వారికి కావాల్సిన ఆహార పదార్థాలను వెంటనే అందించాలని అధికారులను కోరారు. వివిధ తండాల్లో ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో బాధితులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఆయన అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వర్షం కారణంగా ఎన్నో వరి పంట పొలాలు, నీటిలో మునిగిపోయాయని, అధికారులు వచ్చి అంచనా వేసి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. అనంతరం సిరికొండ మండలంలోని కొండూరు గ్రామ వద్ద బ్రిడ్జ్ తెగిపోవడంతో పరిశీలించడం జరిగింది. బ్రిడ్జ్ సగభాగం తెగపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయని, కొండూరు గ్రామంలో 150 ఇళ్లలోకి నీరు చేయడంతో బాధితులకు ఆహార సామాగ్రి వెంటనే ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అనంతరం పెద్దవాళ్లగోట్లో రెండు కూలీ లైన్లను పరిశీలించారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పెద్దవాళ్లగడ్డ చిన్నవాళ్లకి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని, త్వరలోనే పనులు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఊర్డు అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, ఏఎంసి డైరెక్టర్ మంత్య నాయక్, మాజీ ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ మునుపల్లి సాయ రెడ్డి, నిజాంబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్ ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్న బాలరాజ్, ఇందాల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సిరికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, ఓన్నజీపేట మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రామన్న గ్రామ శాఖ అధ్యక్షులు నర్సారెడ్డి, రామన్న, గ్రామ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >