Posted on 2025-08-28 17:54:55
కామారెడ్డి లో చోటు చేసుకున్న వరద బీభత్సంపై అధికారులతో సమీక్షించిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖామంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఇంతటి విపత్కర పరిస్థితిలో అధికారులు సమన్వయంతో పని చేయడం అభినందనీయం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఫైర్ అదనపు డీజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు అనేకమంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని, క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడిన భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని పేర్కొన్నారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రక్షించడం, పోచారం డ్యామ్ కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిదర్శనమని మంత్రి అభినందించారు.
జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేయలేకపోయారని మంత్రి సీతక్క వివరించారు. రోడ్లు, చెరువుల కట్టలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలని, ప్రమాదకర రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇండ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. వరద ప్రభావంతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >