Posted on 2025-08-30 14:02:36
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి ఈ రోజు పదవీ విరమణ పొందిన ముగ్గురు ఎస్ఐలు,ఇద్దరు ఏఎస్సైలు ఒక హెడ్ కానిస్టేబుల్ ను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజా ఐపిఎస్ హేమచంద్రాపురం లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఖాజా మక్సుద్ అలీ ఖాన్, అశ్వాపురం స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కొత్తా నాగేశ్వరరావు,లక్ష్మిదేవిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న మందపల్లి ప్రసాద్ రావు,జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కుక్కమళ్ళ కోటేశ్వరరావు, ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న చిన్నధనపాల్ రవి,మరియు ములకలపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు కన్నిడి వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందడం జరిగింది.పదవీ విరమణ పొందిన ఈ ఆరుగురు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీ పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.సుమారు 40 ఏళ్ల పైన పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఆరుగురు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,ఏఓ మంజ్యా నాయక్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,లక్ష్మిదేవిపల్లి ఎస్సై రమణా రెడ్డి,ఎంటిఓ సుధాకర్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >