Posted on 2025-08-31 09:41:09
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు వెళ్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ ఇంటిపై ఇటీవల అకాల వర్షాలకు, గాలి దుమారంకు విద్యుత్ వైర్లు తెగి ఇంటిపై వేలాడడంతో అది గమనించని ఓ పెయింటర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నాందేవ్ (45) సంవత్సరాల వ్యక్తి ఆ ఇంటికి పెయింటింగ్ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >