Posted on 2025-08-31 16:35:46
దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా విపత్తు సహాయ చర్యలను చేపట్టాలని డిమాండ్..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలో పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి పేర్కొన్నారు. ఘటనపై కేంద్ర విపత్తు సహాయక బృందం కూడా చర్యలు తీసుకొని అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరద బాధితులను ఆదుకోవాలని ఆమె అన్నారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ కౌన్సిల్ సమావేశం లో కామారెడ్డి లో జరిగిన పరిస్థితిని ఇక్కడే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీల బృందం కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలలో పర్యటించింది. భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, శంకర్ నాయక్ పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు కేంద్రప్రభుత్వం సహకారం అవసరమని పేర్కొన్నారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, పండ్లరాజు, షబ్బీర్ అలీ తనయుడు మహమ్మద్ ఇలియాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >