Posted on 2025-08-31 18:37:31
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మాక్లూరు మద్యం డిపో నుంచి డీసీఎంలో మద్యం లోడ్ తీసుకువస్తున్న డ్రైవర్ డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని రైల్వే కమాన్ వద్ద ఆదివారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మాక్లూర్ మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డీసీఎం వ్యాన్‌లో లోడ్ వేసుకుని వస్తుండగా.. పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో డీసీఎం డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ కాగా.. ఈమేరకు పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ పేర్కొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >