Posted on 2025-09-02 11:50:34
ఒకేసారి నలుగురిని కత్తెరతో దాడికి దిగబడ్డ నిందితుడు
చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించిన స్థానికులు.. విచారణ చేపడుతున్న పోలీస్ యంత్రాంగం..
డైలీ భారత్, నిజామాబాద్:ధర్పల్లి మండలకేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. ఎన్టీఆర్ కాలనికి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి కాలనీలో నలుగురిని దర్జీ కత్తెర తో పొడిచారు. మొదటగా కాలనీలో గల మచ్చ లక్ష్మీ ని కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డు వెళ్ళగా ఆమెను కూడా పొడిచాడు.అక్కడ గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వారు వెళ్ళగా వారిలో శెట్పల్లి నాగరాజు,అతని భార్య శోభ ను కూడా కత్తెరతో పొడిచి,అక్కడి నుండి కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ అనే వ్యక్తి షాపు దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కత్తెరతో పొడవడం జరిగింది.గాయపడ్డ నలుగురిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని,ఎవరికి ప్రాణాపాయం లేదని,సంఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని,ప్రస్తుతం విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >