| Daily భారత్
Logo




పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సస్పెన్షన్ తప్పదు

News

Posted on 2025-09-02 13:20:18

Share: Share


పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సస్పెన్షన్ తప్పదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అధికారంలోకి వచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం..

నిజామాబాద్ మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు పార్టీలో ఉన్న ఎవరైనా సరే సస్పెన్షన్ తప్పదని, అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన, తనయుడైన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని అందుకే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధినేత కేసిఆర్ సస్పెండ్ చేసినట్లు నిజామాబాద్ మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలందరికీ ఇది వర్తిస్తుందని ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆమె పదేళ్లపాటు నిజామాబాద్ ఎంపీగా ఎన్నో సేవలు అందించినప్పటికీ పార్టీ సిద్ధాంతాలకు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అందుకే ఆమె సస్పెండ్ కు గురైనట్లు తెలిపారు.

ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేక విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. అసలు 18 నెలలు గడిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేశారు బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు  సిర్ప రాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >