Posted on 2025-09-05 13:44:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని గంగస్థాన్ పేస్ వన్ లోని విష్ణు ప్రియ రెసిడెన్సి అపార్ట్మెంట్లో నివాసముండే భక్తులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను తమ అపార్ట్మెంట్లో ఘనంగా అందరము కలిసి ఐక్యమత్యంతో ఉత్సవాలను నిర్వహించుకుంటామని వారు వెల్లడించారు. ఆ వినాయకుని అనుగ్రహం వల్ల తమ అపార్ట్మెంట్లు నివాసం ఉండే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ప్రసాదించాలని కోరారు. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడు అందరి పట్ల అనుగ్రహం చూపాలని వారు ఆకాంక్షించారు. 11 రోజులపాటు ఉదయం సాయంత్రం వేళలో ఆ వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితుల చేత నిర్వహించామని అలాగే మరి కొంత మంది భక్తులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో ఆ వినాయకుని ప్రశ్య ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం జరిగిందని, అలాగే అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా గత రెండు రోజుల నుండి తమ అపార్ట్మెంట్ భక్తులు ముందుకు వచ్చి అన్నప్రసాద చేయడం తమ అపార్ట్మెంట్ వాసుల ఐక్యతకు నిదర్శనంగా నిలుతుందన్నారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం పుష్పార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >