| Daily భారత్
Logo




కె ఎఫ్ సి ఆర్డల్లో కుళ్ళిన చికెన్

News

Posted on 2025-09-08 18:49:34

Share: Share


కె ఎఫ్ సి ఆర్డల్లో కుళ్ళిన చికెన్

ఇదేం కుళ్లిపోయిన చికెన్ అంటూ వాగ్వివాదానికి పాల్పడిన వినియోగదారుడు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు. ఆహార ప్రియుల టేస్టులకు అనుగుణంగా కార్పొరేట్​ ఫుడ్​ సెంటర్లు విస్తరిస్తున్నాయి. నిజామాబాద్​లోనూ అంతర్జాతీయ స్థాయి ఫుడ్​ సెంటర్లు నెలకొల్పబడ్డాయి. దీంతో వీటిలోనూ జనాలు ఎగబడుతున్నారు. నాణ్యత గురించి ఆలోచించకుండా ఆర్డర్​లు పెట్టుకుని లాగించేస్తున్నారు. అయితే, సంపాదన ఆర్జించడమే ధ్యేయంగా పనిచేసే కార్పొరేట్​, ఇతర ఫుడ్​ సెంటర్లు నాణ్యత పాటించడం లేదు. వినియోగదారులను నిండా మోసగిస్తూ కుళ్లిపోయిన పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైపై రంగులకు మోజుపడి ఎగబడి తింటూ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు వినియోగదారులు. తాజాగా నిజామాబాద్​లోని ఓ కార్పొరేట్​ ఫుడ్​ సెంటర్​లో కుళ్లిపోయిన చికెన్​తో పదార్థాలు తయారు చేశారంటూ ఓ వినియోగదారుడు గగ్గోలు పెట్టాడు. సదరు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

నిజామాబాద్​ నగరంలోని వేణుమాల్​లో ఉన్న కేఎఫ్​సీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. 

సదరు వీడియోలో ఉన్నదాని ప్రకారం.. కస్టమర్​ చికెన్​ లెగ్​పీస్​లు ఆర్డర్​ పెట్టాడు. కాగా, వేడి వేడిగా వచ్చాయని ఆరగిద్దామని నోట్లో పెట్టుకుంటే కుళ్లిన వాసన రావడాన్ని గుర్తించానని సదరు కస్టమర్​ చెబుతున్నాడు. ఈ మేరకు కుళ్లిన చికెన్​ ఎలా పెడతారంటూ అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు సదరు వినియోగదారుడు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు కస్టమర్​ తీయించినట్లు తెలుస్తోంది. వారే సోషల్​ మీడియాలో పోస్టు చేయడంతో.. నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే హాట్​ టాపిక్​గా మారింది.

దీనిపై ఆహార ప్రియులు మండిపడుతున్నారు. సదరు కార్పొరేట్​ సంస్థపై అధికారులు దాడులు చేపట్టి, నిజనిజాలు నిర్ధారించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >