| Daily భారత్
Logo




డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక

News

Posted on 2025-09-10 13:38:09

Share: Share


డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ గారిని డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.

డా. కిరణ్ కుమార్  సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. చైతన్య స్ఫూర్తి వంటి ప్రథమ గ్రంథం, ఓ తండ్రి తీర్పు లఘు చిత్రకథ, వందలాది పత్రికలలో వెలువడిన అనేక కవితలు,వ్యాసాలు, సమీక్షలు, సంపాదకీయాలు—ఇవి అన్నీ తెలుగు పాఠకలోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి గర్వకారణంగా నిలిచింది.

ఈ అవార్డు, పద్మశాలి కుల భూషణులు, వేలాది లలితగీతాలు రచించిన సుప్రసిద్ధ సినీ గేయరచయిత, జాతీయ మహాకవి స్వర్గీయ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ  స్మారకార్థం సంస్థ స్థాపించింది. తెలుగు సాహిత్యానికే కాదు, సంగీత, సినీ ప్రపంచానికీ ఆయన అందించిన విలువైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.

ఈ అవార్డును మొదటిసారిగా డా. చిటికెన కిరణ్ కుమార్ గారికి అందజేయడం తమ సంఘానికి గర్వకారణమని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు  తుమ్మ సత్యనారాయణ, సూరేపల్లి రవికుమార్ లు ఒక  ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే ప్రత్యేక  కార్యక్రమంలో,  ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారం ఘనంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >