| Daily భారత్
Logo




సింగరేణి ఎన్నికల్లో INTUC హవా

News

Posted on 2023-12-28 10:11:13

Share: Share


సింగరేణి ఎన్నికల్లో INTUC హవా

ఆరు చోట్ల సత్తా చాటిన AITUC

డైలీ భారత్, రామగుండం:తెలంగాణలో బుధవారం రోజున జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC, సీపీఐ అనుబంధ సంఘం AITUC సత్తా చాటాయి.

మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందా యి. గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ అసలు పోటీలో లేకుండా పోయింది.

ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర కార్మికశాఖ అధికా రులు తెలిపారు. అత్యధి కంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువ గా శ్రీరాంపూర్‌, రామగుం డం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి.

సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగానే బ్యాలెట్‌ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు.

సింగరేణి ఎన్నికల్లో 13 సంఘాలు పోటీ చేశాయి. ఇందులో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ హోరాహోరీగా పోటీ పడ్డాయి.

బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది.

కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ పోటీలో లేకుండా పోయింది.

మొదటి నుంచి తాము బరిలో ఉండి ఏరియాలో పట్టు సాధిస్తామని చెప్పుకుంటూనే గనులు, డిపార్ట్‌ మెంట్లలో ప్రచారాన్ని కొనసాగించిన సదరు నాయకులు ఎన్నికల రోజు కనిపించలేదు. తమ ప్రత్యర్ధి ఐఎన్‌టీయూసీ ఈ ఎన్నికల్లో గెలువ కూడదనే ఉద్ధేశ్యంతో ఏఐటీయూసీ కార్మిక సంఘానికి ఇంటర్నల్‌గా మద్దతు ఇచ్చినట్లు అయింది..

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >