Posted on 2025-09-11 08:54:33
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జెసిఐ వారోత్సవాల్లో భాగంగా గురువారం మూడో రోజు సందర్భంగా నిజామాబాద్ క్యూర్ యోగా ట్రేైనర్ డాక్టర్ ఐశ్వర్య ఆధ్వర్యంలో యోగ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను విశదీకరించారు. యోగా శరీరాన్ని బలపరచడమే కాకుండా, మనసును పదునుగా మార్చి జీవనశైలిలో ఆరోగ్యానికి సమతుల్యతను తీసుకువస్తుందని చెప్పారు. గృహిణి అయినా, ఉద్యోగి అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జీవితంలో చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అని ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత పొందవచ్చు అని అన్నారు. రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాలు యోగకు సమయం కేటాయించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, ఒత్తిడి తగ్గుతుందన్నారు. సమగ్ర ఆరోగ్యం మెరుగుపడుతుంది అని తెలిపారు.
కార్యక్రమం లో జేసీఐ ఇందూరు అధ్యక్షురాలు గౌతమి పెండోటి సభ్యులు,మహిళలు పాల్గొన్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >