Posted on 2025-09-12 16:16:57
గంజాయి,ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,ఇతరులకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవు : టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీకాంత్..
డైలీ భారత్, వేములవాడ: జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలో ఉన్న ఉన్న పాన్ షాపులలో,కిరాణా షాప్ లలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీస్ నార్కోటిక్ జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ...
జిల్లాలో జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,జిల్లాలో విన్నూత కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు ఆనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అందువలన పట్టణ పరిధిలో ఉన్న పాన్ షాప్ లలో గంజాయి పదార్థాలను గుర్తించే జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని,జిల్లాలో గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద,పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ
Posted On 2026-07-11 13:44:17
Readmore >
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >